డీఎస్సీ దీక్షలపై ఖాకీల కక్ష! | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ దీక్షలపై ఖాకీల కక్ష!

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

న్యూస్‌రీల్‌

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు

ఏలూరులో కార్యాలయం వద్ద బైఠాయింపు

గేటు వద్దనే రిలే నిరాహార దీక్షలు

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026

దెందులూరు: దెందులూరు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని ఏలూరు రూ రల్‌ మండలం మాదేపల్లిలో జరిగే రిలే నిరాహార దీక్షలకు వెళ్లకుండా శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. 30 మంది పోలీసులు శాంతిభద్రతల సాకు తో ఏలూరులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గంటకు పైగా నిలిపివేయడంతో, ఆయన కార్యా లయం గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం అమలు అవుతుంటే, దెందులూరులో మాత్రం మరో రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మా జీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆ దేశించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి తప్పులు జరగనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. శాంతియుతంగా మాదేపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్‌ తీసేసి వాళ్లని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని, వారి మీద ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ అక్రమాలూ జరగలేదని చెబుతున్న ప్రభు త్వం సీబీఐ విచారణకు సిద్ధపడాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement