చేనేతను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

చేనేతను ప్రోత్సహించాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

చేనేతను ప్రోత్సహించాలి మోగల్లు హైస్కూల్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌ ఎకై ్సజ్‌ దాడులు పురివిప్పిన మయూరం డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నెమ్మదిస్తున్న వరద

భీమవరం (ప్రకాశంచౌక్‌): చేనేత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా నేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని జేసీ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ, సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. యువత చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా ఈ కళ తరతరాలకు కొనసాగుతుందని తెలిపారు. 82 చేనేత స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల కింద మంజూరు చేసిన రూ.1.30 కోట్ల చెక్కును జేసీ కలెక్టర్‌ చేతులమీదుగా అందజేశారు. చేనేత వస్త్రాలు తయారుచేస్తున్న ఎ.నాగేశ్వరరావు (రాయకుదురు), వి.కోటయ్య (దగ్గులూరు), మేక పూర్ణారావు (చింతపర్రు)ను సత్కరించారు. జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి ఎ.అప్పారావు, డీఆర్‌ఓపీ ప్రభాకర్‌, కలెక్టరేట్‌ ఏఓ ఎన్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: పాలకోడేరు మండలం మోగల్లు జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం ఎంవీ త్రినాథులను సస్పెండ్‌ చేసినట్టు డీఈఓ ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున త్రినాథులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు.

భీమవరం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బి.సుబ్బారావు తెలిపారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆరు ఎకై ్సజ్‌ స్టేషన్ల పరిధిలోని 193 బ్రాందీ షాపులు, 28 బార్లపై దాడులు నిర్వహించినట్టుచెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

బుట్టాయగూడెం: మండలంలోని మారుమూరు అలివేరు గ్రామంలో శుక్రవారం చిరుజల్లులు కురవడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు సమీపంలోని అడవి నుంచి నెమలి వచ్చింది. గ్రామ సమీపంలోని చెట్టు కొమ్మపై కొద్దిసేపు కూర్చున్న తర్వాత జల్లులు పడగానే కిందకు దిగి పురివిప్పి నర్తించింది. ఓ పక్క జల్లులు.. మరోపక్క మయూర నృత్యంతో ఈ ప్రాంతంలో వాతావరణం రమణీయంగా మా రింది. స్థానికులు ఈ దృశ్యాన్ని వీక్షించి సెల్‌ఫోన్‌లో బంధించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ సింగిల్‌ మేజర్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తున్నారని, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అడ్మిషన్‌ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు హెచ్‌ఎల్‌సీ కోఆర్డినేటర్‌ కె.రమేశ్‌ 9247203460, వెరిఫికేషన్‌ ఆఫీసర్‌–1 ఎం.కృష్ణ చైతన్య 9490216357, వెరిఫికేషన్‌ ఆఫీసర్‌–2 పీఆర్‌ కావ్యశ్రీ 9441376464, ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావును 9010042250 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద యథాస్థితికి చేరుకుంటోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడం, నదిలోకి చేరే నీరు కూడా క్రమేపీ తగ్గుతుండటంతో వరద ప్రవాహం నెమ్మదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28 మీటర్ల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దిగువన వరద ప్రభావం తగ్గుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement