పార్టీ నాయకులు ముదుగురు సూర్యనారాయణ, మండల కొండలరావు, మోరు రామరాజు, ఆళ్ల సతీష్ చౌదరి, తేరా ఆనంద్ తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కేవరకు, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఇక్కడకు వచ్చి సంఘీభావం తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంగరాజు, పళ్లెం ప్రసాద్, డీవీఆర్‌కే చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌చౌదరి, యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రజక విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె.శేషు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, మాజీ సర్పంచులు పి.సునీత ప్రభుదేవా, వరి నారాయణ, బాల, ఎంపీటీసీ పులవర్తి దేవానంద్, క్లస్టర్ ఇన్‌చార్జి తొత్తడి కృష్ణ, ప్రేమ్ బాబు, పార్టీ అధ్యక్షులు కురుమ ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ యేసు, పెదవేగి మండల నాయకులు మేడికొండ కృష్ణారావు, పాలడుగు భానుప్రకాష్, బలుసు శేఖర్, చల్లగొల్ల తేజ, కార్యకర్తలు నియోజవర్గంలో వైఎస్సార్‌సీపీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ఉన్నారు.


