భీమవరం: అగ్నికుల క్షత్రియ జాతిపితగా, సంఘ సంస్కర్తగా పొన్నమండ లక్ష్మణస్వామివర్మ సమాజానికి విశిష్ట సేవలందించారని అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం లక్ష్మణవర్మ జయంతి సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, ఆయుర్వేదంలో పొన్నమండ విశేష సేవలందించారన్నారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, మహిళా ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఈ.ఇందుమతి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో..
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్‌లో శుక్ర వారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణ స్వామివర్మ 157వ జ యంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. డీఆర్వో పి.ప్రభాకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


