అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థిని

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థిని

తణుకు అర్బన్‌: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.నాగలక్ష్మి అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. గతనెల 26న తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ అండ్‌ అండర్‌–18 విభాగంలో 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ ప్రతిభ కారణంగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని నాగలక్ష్మి ఎంపికై నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థినితోపాటు శిక్షణనిచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్‌ సంకు సూర్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement