నిట్‌లో సింపోజియం | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో సింపోజియం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

తాడేపల్లిగూడెం: ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌ సాంకేతికత ఎంతో కీలకమని కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ బిస్వరూప్‌ సత్పతి అన్నారు. నిట్‌లో శుక్రవారం ఎలక్ట్రాన్‌ సూక్ష్మదర్శినిపై పరిశోధన సింపోజియం జరిగింది. ఆధునిక పరిశోధనల్లో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎలక్ట్రాన్స్‌ మైక్రోస్కోప్‌ , ప్రిన్సిపల్‌ టెక్నిక్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌పై సింపోజియం నిర్వహించారు. ఆధునిక శాసీ్త్రయ పరిఽశోధనలు ముఖ్యంగా మెటీరియల్‌ సైన్సు, నానో టెక్నాలజీ, ఎనర్జీ మెటీరియల్స్‌, నానో మెటీరియల్స్‌ తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. ఆధునిక సాంకేతికత వాటి పని సూత్రాలు, పరిశోధనల్లో వాటి వినియోగంపై విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. బిస్వరూప్‌ సత్పతి ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ గురించి వివరించారు. ఐఐటీ ఖర్గపూర్‌కు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్‌ అహిన్‌ రాయ్‌ స్కానింగ్‌ టన్నెలింగ్‌ మైక్రోస్కోపీపై మాట్లాడారు. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ ద్వారా పొందే సూక్ష్మస్ధాయి సమాచారం కొత్త పదార్ధాల రూపకల్పన, అధిక సామర్ధ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్‌ పరికరాలు, బ్యాటరీలు, కాటలిస్టులు, సెమీకండక్టర్‌ పదార్థాలు, నానో మెటీరియల్స్‌ బయో మెటీరియల్స్‌ రంగాల్లో పరిశోధనలకు సాంకేతికతలు కీలకంగా ఉంటాయన్నారు. నిట్‌ డీన్‌ రవికిరణ్‌శాస్త్రి మాట్లాడుతూ ఆధునిక పరిశోధనల్లో అత్యాధునిక పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. అసోసియేట్‌ డీన్‌ తపస్‌ పరమాణిక్‌ అవగాహన కల్పించేందుకు ఈ సింపోజియంలు ఉపయోగపడతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement