డీఎస్సీ అక్రమాలపై సమరభేరి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సమరభేరి

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

ఉత్సాహంగా క్రీడా పోటీలు అభివృద్ధికి శ్రీకారం

న్యూస్‌రీల్‌

ఉత్సాహంగా క్రీడా పోటీలు
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో u

కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికి అభివృద్ధి చెందుతోంది. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 8లో u

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి, భీమవరం: డీఎస్సీ –2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్‌ లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలేదీక్షలు గురువారం జిల్లా అంతటా మొదలయ్యాయి. పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాదిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు నడుమ పార్టీ నేతలు శిబిరాలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని, మంత్రి పదవికి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయాలని, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయా లని, హాస్టల్‌ విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ యువతకు నెలనెలా రూ. మూడు వేలు భృతి చెల్లించాలని నినదించారు.

తణుకులోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రిలే దీక్షల శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్‌ పరిశీలకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రారంభించారు. పాలకొల్లు, నరసాపురంలోని దీక్షా శిబిరాలను సందర్శించారు. తణుకు పరిశీలకుడు కొట్టు వెంకటనాగు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం పాల్గొన్నారు.

ఆచంటలోని కచేరి సెంటర్‌ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలోని పోలీస్‌ ఐలాండ్‌ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డి రఘురాంనాయుడు ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు.

భీమవరంలోని ప్రకాశంచౌక్‌ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దీక్షల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్‌ రాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవిరాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్‌, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ పాల్గొన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద దీక్షలు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్‌ వద్ద దీక్షా శిబిరంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజి, గుణ్ణం నాగబాబు, చిగురుపాటి సందీప్‌, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత పాల్గొన్నారు.

ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ మంతెన యోగీంద్రబాబు ఆధ్వర్యంలో కాళ్లలోని బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన దీక్షల్లో క్షత్రియ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్‌, ఆర్‌టీఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజి పాల్గొన్నారు.

దీక్షాదక్షత

నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు

తరలివచ్చిన పార్డీ కేడర్‌, యువత, మేధావులు

సీబీఐ విచారణ, లోకేష్‌ రాజీనామాకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement