దారులన్నీ దేవరపల్లి వైపే.. | - | Sakshi
Sakshi News home page

దారులన్నీ దేవరపల్లి వైపే..

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

ప్రమాదభరితంగా కల్వర్టులు కావడి సేవ.. భక్తికి తోవ

న్యూస్‌రీల్‌

పొగాకు రైతులకు భరోసా

ప్రమాదభరితంగా కల్వర్టులు
ఆకివీడు మండలంలోని జాతీయ రహదారి 165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. 10లో u

కావడి సేవ మహోత్సవానికి ముదినేపల్లి మండలం శింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సిద్ధమైంది. 10లో u

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026

ద్వారకాతిరుమల: పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి విచ్చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల నుంచి భారీ సంఖ్యలో పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలివచ్చారు. హెలీప్యాడ్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు మాజీ హోం మంత్రి తానేటి వనిత, విశాఖ స్మార్ట్‌ సిటీ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జై జగన్‌ నినాదాల మధ్య రోడ్డు మార్గంలో పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

చూడాలన్న తపనతో..

వైఎస్‌ జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న తపనతో వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు చెట్లు, లారీలు, ఇతర వాహనాలపైకి ఎక్కి మరీ అభిమాన నేతను చూసి సంబరపడగా, మార్గమధ్యంలో క్రేన్‌ సాయంతో భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. రహదారులన్నీ జన సందోహంతో కిక్కిరిశాయి.

భద్రతా వైఫల్యం : హెలికాప్టర్‌ దిగగానే అభిమానుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది. జగన్‌ను దగ్గరగా చూసేందుకు కొందరు బారికేడ్లు దూకగా, మరికొందరు వాటిని పడగొట్టి హెలీప్యాడ్‌ వైపు పరుగులు తీశారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తగినంత మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వచ్చాయి. జగన్‌ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అడుగడుగునా అడ్డంకులు : ట్రాఫిక్‌ నియంత్రణ పేరుతో పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పలుచోట్ల అడ్డుకున్నారు. దేవరపల్లి డైమండ్‌ సర్కిల్‌ వద్ద బైక్‌లు, కార్లలో వస్తున్న కార్యకర్తలను నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో వారు పొగాకు వేలం కేంద్రానికి చేరుకోలేకపోయారు. యాదవోలు–దేవరపల్లి రహదారిలోనూ వాహనాలను నిలిపివేయడంతో కార్యకర్తలు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది.

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాథ్‌, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తాడేపల్లిగూడెం, చింతలపూడి నియోజకవర్గాల ఇన్‌చార్జులు వడ్డి రఘురామ్‌, కంభంపాటి విజయరాజు తదితరులు ఉన్నారు.

అభయమిస్తూ.. మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌. చిత్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌, మాజీ మంత్రి వనిత, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, భీమవరం కన్వీనర్‌ చినమిల్లి, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు

ఘన స్వాగతం.. వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి వనిత, భీమవరం కన్వీనర్‌ చినమిల్లి

జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

కై కలూరు: పొగాకు రైతుల ఇబ్బందులపై దేవరపల్లికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రావడంతో రైతులకు భరోసా కలిగిందని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలను బుధవారం ఆయన అభినందించారు. డీఎన్నార్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో కిలో రూ.289 ధర పలికిన పొగాకు నేడు రూ.236కి పడిపోయిందన్నారు. నాడు వైఎస్‌ జగన్‌ రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆందోళన కార్యక్రమానికి జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలిరావడం ప్రభుత్వంపై విరక్తికి కారణమని చెప్పారు. జిల్లాలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు డీఎన్నార్‌ పిలుపునిచ్చారు.

అభిమాన పరవళ్లు

వైఎస్‌ జగన్‌ పర్యటనలో జన జాతర

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలిన పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు

వైఎస్‌ జగన్‌ భరోసాతో రైతులకు ఊరట

భద్రతా వైఫల్యాలు, పోలీసుల అడ్డంకులు ఎదురైనా పర్యటన జయప్రదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement