ప్రమాదభరితంగా జాతీయరహదారి కల్వర్టులు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదభరితంగా జాతీయరహదారి కల్వర్టులు

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

మూలలంక బోదెకు ఉన్న పిట్టగోడలు కూలిపోయి ప్రమాదభరితంగా ఉన్న కల్వర్టు

ప్రధాన సెంటర్‌లో కల్వర్టు పిట్టగోడ పడి

అండలు జారుతున్న దృశ్యం

ఆకివీడు: జాతీయ రహదారి నెం.165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ మార్గంలో చాలా కల్వర్టులు పురాతనమైనవి కావడంతో పిట్టగోడలు విరిగిపోయాయి. గంగానమ్మ కోడు, అయిభీమవరం రోడ్డు, తెల్లవంతెన, మాదివాడ సెంటర్ల వద్ద కల్వర్టులు కుంగిపోయి, నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎదురుగా వాహనాలు వస్తే కిందపడిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత మరమ్మతులు చేయకుండా, కేవలం రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. అలాగే, వర్షపు నీటితో నిండిన ప్రమాదకర మార్జిన్లు, ఆక్రమణల వల్ల రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఎన్‌హెచ్‌ అధికారులు స్పందించి, శిథిలావస్థలో ఉన్న కల్వర్టులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement