భీమవరం: కళాశాలల విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీ వీపీ ఆధ్వర్యంలో బుధవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్టు జిల్లా కన్వీనర్ రాయి వెంకట దుర్గాసాయి, భీమవరం విభాగ్ కన్వీనర్ కాయిత డిన్ను చందు చెప్పారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రవేశ పరీక్షలు పూర్తయి రెండు నెలలు గడిచినా సగం కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించలేదన్నారు. కన్వీనర్ శ్యామ్ విజయరాజ్, పట్టణ సహాయ కార్యదర్శి దొమ్మేటి అనూష భవ్య పాల్గొన్నారు.
భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అడిషినల్ ఎస్పీ డి.విశ్వనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధా న కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంత రం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం : జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టెట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ కళాశాల కేంద్రాల్లో బుధవారం నుంచి 16 వరకు రోజు కు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారన్నా రు. మొత్తంగా 4,812 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్‌ఎన్ చారిటీస్ (కాకినాడ) ఈఓ సీహెచ్ సురేష్‌నాయుడు పర్యవేక్షణలో లె క్కించారు. గత 25 రోజులకు నగదు రూపంలో 2,81,82,065లు, 242 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.22 వేలు లభించిందన్నారు. సగటున రోజుకు రూ.11,27,283 ఆదాయం లభించిందన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రభు త్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 1,000 ఉద్యోగులు, ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రా న్ని జేసీ అభిషేక్ గౌడకి సమర్పించారు. జిల్లా జేఏసీ చైర్మన్లు కె.రమేష్‌కుమార్, రాంబాబు, కో–కన్వీనర్ ఎన్.సురేష్, కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించ డం వల్ల ప్రజారవాణా దెబ్బతింటుందన్నారు.


