గోదావరి వరద తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

గోదావరి వరద తగ్గుముఖం

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

గోదావరి వరద తగ్గుముఖం

సిద్ధాంతంలో కేదారీఘాట్‌ వద్ద గోదావరి

నరసాపురంలో పిండ ప్రదానం షెడ్డుపైకి వరద

పెనుగొండ: గోదావరి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. సోమవారం ఎగువ నుంచి వ రద నీరు రావడం తగ్గడంతో సిద్ధాంతం కేదారీఘాట్‌లో రెండు అడుగుల మేర నీటిమట్టం తగ్గింది. ఆ దివారం గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అ యితే తగ్గుముఖం పట్టడంతో గోదావరి లంకల్లోకి రైతులు రాకపోకలు ప్రారంభించారు. అయినా అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆచంట మండలంలో పెదమల్లం మాచేనమ్మ కట్ట లో ప్రవేశించిన వరద నీరు నెమ్మదిగా తగ్గుతోంది. కోడేరులో పుష్కర రేవులు బయట పడుతున్నాయి. గోదావరిలో పడవల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. లంక గ్రామాల్లో ప్రజలు మాత్రం ఆందోళనలోనూ ఉన్నాయి. ఎటువంటి సహాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు.

నరసాపురంలో వరద ఉధృతి

నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల ప్రజ లు భయపడుతున్నారు. స్థానికంగా నదిలో, గోదా వరి మాత విగ్రహంవద్ద నీటి మట్టం భారీగా పెరి గింది. వలంధరరేవు వద్ద పోలీసు పహారా ఏర్పా టు చేశారు. పడవల రేవులో పంటు రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement