‘నిట్టూ’రుస్తూ.. నెట్టుకొస్తూ..! | - | Sakshi
Sakshi News home page

‘నిట్టూ’రుస్తూ.. నెట్టుకొస్తూ..!

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

‘నిట్టూ’రుస్తూ.. నెట్టుకొస్తూ..!

తాడేపల్లిగూడెం : ప్రతిష్టాత్మకంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటైన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ నిట్‌) ప్రస్తుతం పాలనాపరమైన నిర్లక్ష్యం, అంతర్గత కోటరీ వ్యవస్థ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సంస్థ 8వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు.

రెగ్యులర్‌ డైరెక్టర్‌ కరువు

తొలి రెగ్యులర్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు సస్పెన్షన్‌ తర్వాత ఇప్పటివరకు మరో రెగ్యులర్‌ డైరెక్టర్‌ ని యమితులు కాలేదు. పలువురు ఇన్‌చార్జి డైరెక్టర్లు మారినా పరిస్థితి చక్కబడలేదు. చివరకు ఎంపికై న రెగ్యులర్‌ డైరెక్టర్‌ కూడా బాధ్యతలు తీసుకోకుండా వెనుదిరిగేలా ఇక్కడి వాతావరణం తయారైంది. రెండేళ్ల క్రితం రెగ్యులర్‌ డైరెక్టర్‌ పోస్టు నియామకం కోసం నోటిఫికేషన్‌ వేసినా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రస్తుతం వరంగల్‌ నిట్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌వీ రమణరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

కరిగిన సీట్లు.. ఆగిన అభివృద్ధి

రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేరనే సాకుతో గతంలో ఉన్న 720 సీట్లను 480కి తగ్గించారు. దీనివల్ల హోమ్‌ స్టేట్‌ కోటా కింద రావాల్సిన 240 సీట్లను ఏపీ విద్యార్థులు కోల్పోయారు.

ర్యాంకింగ్స్‌లో వెనుకంజ

గతంలో క్యాంపస్‌ సెలెక్షన్లలో ముందంజలో ఉన్న నిట్‌ ఇప్పుడు తీవ్రంగా దిగజారింది. కంపెనీలు రా క, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కక వె నుకబడింది. రూ.1,700 కోట్ల హెఫా నిధుల ప్రతిపాదనలు తగిన ఫాలోఅప్‌ లేక మూలనపడ్డాయి.

మీడియాపై ఆంక్షలు

క్యాంపస్‌ లోపల జరిగే అక్రమాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ, తామే సర్వం అనే రీతిలో నలుగురు నిట్‌ను తమ గుప్పెట్లో ఉంచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ నిట్‌లో పడకేసిన అభివృద్ధి

ఒక్క డైరెక్టర్‌తో సరి

వెనక్కి వెళ్లిన 240 సీట్లు

మీడియాపై ఆంక్షలు

నేడు 8వ స్నాతకోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement