భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజల వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 168, రెవెన్యూ క్లినిక్‌లో 32 అర్జీలు స్వీకరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, ఇన్‌చార్జి డీఆర్వో పి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● గణపవరం మండలం కోమర్రులో మంచినీటి చెరువులను బాగుచేయించాలని పత్తి రెడ్డి కోరారు.
● గణపవరం మండలం కాశిపాడు హైస్కూల్‌లో హిందీ, సోషల్ టీచర్లను నియమించాలని జె.వెంకటరత్నం వినతిపత్రం అందించారు.
● కాళ్ల మండలం ఏలూరుపాడులో తనకున్న 56 సెంట్ల భూమి 22ఏలో ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని, పరిష్కరించాలని అడపా వెంకటలక్ష్మి అర్జీ అందించారు.
● పాలకోడేరు మండలం శృంగవృక్షంలో తన 52 సెంట్ల భూమికి సాగునీరందించే పంట బోదెను ఓ రైతు పూడ్చివేశారని బందెల మౌనిక ఫిర్యాదు చేశారు.


