మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి జిల్లాలో అక్టోబర్‌ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వం 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి ఆధ్వర్యంలో సో మవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద ర్యాలీ ని ప్రారంభించి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గతేడాది 1.0, 2.0లో కేసుల పరిష్కారానికి విశేష కృషి చేశామని, అదే స్ఫూర్తితో 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వారం పాటు సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాజీయోగ్యమైన కేసుల సామరస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నా రు. అన్ని కోర్టుల పరిధిలో మధ్యవర్తులు ద్వారా కా ర్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి అద న పు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వైస్‌. శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement