భీమవరం (ప్రకాశం చౌక్): ప్రభుత్వం తక్కువ ధరలకే సన్నరకం బియ్యం విక్రయాలను ప్రారంభించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఆదివారం భీమవరం రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను జేసీ కేఆర్ కల్పశ్రీతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు రైతు బజార్లు, 40 రైస్ మిల్లుల అవుట్‌లెట్‌లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బి య్యం విక్రయాలు జరుగుతాయన్నారు. రేషన్ కార్డుకు 10 కిలోల చొప్పున స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా బియ్యం కిలో రూ.50 చొప్పున అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. మార్కెటింగ్ ఏడీ సునీల్‌కుమార్, కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, ఎస్టేట్ ఆఫీసర్ కల్యాణ్ పాల్గొన్నారు.


