వైభవంగా ఎస్‌.జానకి స్వర నీరాజనం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎస్‌.జానకి స్వర నీరాజనం

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దక్షిణ భారతదేశ నైటింగేల్‌, గానకోకిల ఎస్‌.జానకి సుమధుర గీతాలకు స్వర నీరాజనం అర్పిస్తూ నగరంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం అలరించింది. కేవీఎస్‌ ట్రస్ట్‌, రేహాన్స్‌ ఈవెంట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైఎంహెచ్‌ఏ హాలులోని కానాల గురుమూర్తి కళావేదికపై ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత గాయని జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేఎల్వీ నరసింహం ఆధ్వర్యంలో గాయనీ గాయకులు జానకి పాడిన ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు. హైదరాబాద్‌ నుంచి విచ్చేసిన ఎం.లలిత, రాంబాబు వేణువాయిద్యం, శాక్సోఫోన్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత ప్రియులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సంగీత విభావరిని ఆశ్వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement