పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా ఎలుకల మందు తిని ఆత్మహత్య

కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. సమీప కోనేరులో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,30,161 ఆదాయం వచ్చిందని తెలిపారు.

ముదినేపల్లి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరం గ్రామానికి చెందిన రమేష్‌ రొయ్యల చెరువు వద్ద మామిడి గురునాథం(33) నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం భార్య దగ్గర రూ.200 మద్యానికి తీసుకున్నాడు. తిరిగి రాత్రికి మళ్ళీ డబ్బులు అడగగా, లేవని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు. భార్య ఫిర్యాదుపై ఆదివారం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement