మద్దిలో హనుమద్‌ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మద్దిలో హనుమద్‌ కల్యాణం

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

మద్దిలో హనుమద్‌ కల్యాణం

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ సువర్చలా సమేత హనుమద్‌ కల్యాణం ఘనంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారిణి ఆర్‌.వి.చందన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement