క్యాంపస్‌ ఉద్యోగాలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ ఉద్యోగాలకు ఎంపిక

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

క్యాంపస్‌ ఉద్యోగాలకు ఎంపిక

భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఏడాది ప్రారంభంలోనే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో 249 మంది ఉద్యోగాలు సాధించారని కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్‌ కె.వి.మురళీకృష్ణంరాజు, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌.దిలీప్‌ చక్రవర్తి చెప్పారు. శనివారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో భారీ వేతనాలతో 249 మంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ సెల్‌ డీన్‌ కె.ఆర్‌.సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ కళాశాల విద్యార్థులకు టీసీఎస్‌లో అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని, దానికి విధి నిర్వహణలో వారు కనబరుస్తున్న పెర్ఫార్మెన్స్‌ కారణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement