పెనుగొండ: గోదావరికి వరద నీరు పోటేత్తడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. సిద్ధాంతం మధ్యస్థ లంకను తాకుతూ నిండుగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రానికి కేదారీఘాట్‌లోని పుష్కరరేవుల పైభాగం వరకూ వరద నీరు చేరుకుంది. దీంతో గోదావరిలో పడవల రాకపోకలపై అధికారులు ని యంత్రణ పెట్టారు. మధ్యస్థలంకలోని పంట ఉత్పత్తులను పడవలపై రైతులు గట్టుకు చేర్చుకొంటున్నారు. సిద్ధాంతంలో వరద ఉధృతిని తహసీల్దార్ జి.అనితకుమారి పర్యవేక్షించారు. కోడేరులోని పుష్కర రేవుల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు.


