భీమవరం: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, మూడో అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు పథకాలను వివరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) హెచ్.అమర రంగేశ్వరరావు పథకాల పనితీరు, అమలు పరిచే క్రమంలో ఎదురయ్యే సమస్యలను అడిగారు. పథకాల అమలులో సమస్యలు ఎదురైతే సంస్థ దృష్టికి తీసుకు రావాలన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సి విల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎన్.శ్రీలక్ష్మి, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), డీఎస్పీ రఘవీర్ విష్ణు, మాతా శిశు సంరక్షణ, సాధికారత జిల్లా అధికారి డి.క్షలక్ష్మి, పిల్లల సంరక్షణ జిల్లా అధికారి ఆర్.రాజేష్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


