జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా | - | Sakshi
Sakshi News home page

జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

ఉండి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పోరాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం పాటుపడతానని వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ నూతన కన్వీనర్‌ మంతెన యోగేంద్రకుమార్‌(బాబు) అన్నారు. నియోజకవర్గ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీఎస్‌ కమిటీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు(వాసు)తో కలిసి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు ఇంటి వద్ద ఉండిలో మాట్లాడారు. యోగేంద్రకుమార్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియోజకవర్గ సమన్వయకర్తగా పెద్ద బాధ్యతలు అప్పగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ దండు నారాయణరాజు కుటుంబంలో పుట్టానని, తాతయ్య జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పనిచేశారన్నారు. నాయనమ్మ రెండు సార్లు జిల్లా బోర్డు సభ్యురాలిగా పనిచేశారన్నారు. తండ్రి మంతెన ప్రహ్లాదరాజు దివంగత వైఎస్సార్‌ సహచరుడిగా పేరుపొందారన్నారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని.. పార్టీ కోసం కష్టపడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే ధ్యేయంగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ యోగేంద్రకుమార్‌కు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త తోడుగా నిలిచి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, జెడ్పీటీసీ రణస్తుల మహంకాళి, ఆకివీడు నగర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి, యేడిద వెంకటేశ్వరరావు, నంద్యాల సీతారామయ్య, అంగర రాంబాబు, గులిపల్లి అచ్చారావు, ధర్మరాజు, గుండాబత్తుల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్‌ యోగేంద్రకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement