నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి
తణుకు అర్బన్: జాతీయ న్యాయసేవల సంస్థ రూపొందించిన వీర్ పరివార్ సహాయత యోజనను సద్వినియోగపరచుకోవాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి పేర్కొన్నారు. జాతీయ న్యాయసేవల సంస్థ ఆదేశాల మేరకు తణుకు కోర్టులో శనివారం కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. అనంతరం వీర్ పరివార్ సహాయత యోజన స్కీమ్ పుస్తకాన్ని ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రాజరాజేశ్వరరావుకు న్యాయమూర్తి అందచేశారు, కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.కృష్ణ సత్యలత, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐడీఎల్ కిరణ్మయి, మహిళ న్యాయవాది పోణంగి శ్రావణి సమీర, మాజీ సైనికులు పాల్గొన్నారు.


