పాలకోడేరు: వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం మండలంలోని విస్సాకోడేరులో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ పథకంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిలో మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, మొక్కలు పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించడమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయన్నారు. కనుమూరి భరత్ మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ఒక భాగమని అందువల్ల మొక్కలను పెంచే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఇంచార్జ్ ఎంపీడీఓ ఎంవీఎస్ రాంప్రసాద్, పాలకోడేరు సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, నడిపూడి వెంకట అప్పారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.


