నవజాత శిశువు మృతి
ఏలూరు జీజీహెచ్‌లో నవజాత శిశువు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 8లో u
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు వేగరిపర్చాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. పైప్‌లైన్ నిర్మాణాల అనంతరం తవ్వి న ప్రాంతాలను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మెగా కంపెనీ ప్రతినిధులతో కలిసి తీర ప్రాంత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల పరిధిలో 862 గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ అమలవుతుందని, సుమా రు రూ.1,400 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 13.25 లక్షల కుటుంబాలకు శుద్ధమైన తాగునీటి అందిస్తామన్నారు.
పంట బీమా తప్పనిసరి
భీమవరం: వరి సాగు చేస్తున్న రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద నమోదు చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఫసల్ బీమా పథకం అమలుపై బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్, ఇన్సూరెన్స్ ప్రతినిధుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. బీమా ప్రీమియం ఎకరాకు రూ.210 చెల్లించాలన్నారు.
నేడు మెగా పీటీఎం
జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు, హెచ్‌ఎంలతో ఆమె సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విద్య అంశాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించడమే సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు.


