గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

పెనుగొండ: పెనుగొండలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో ఉదయం 10.30 గంటలకు విద్యార్థులకు వంట చేస్తుండగా గ్యాస్‌ అయిపోవడంతో రెండో గ్యాస్‌ సిలిండర్‌ తగిలిస్తున్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది. వంట మనిషి కె.మంగాదేవికి మంటలు తగలడంతో స్వల్పగాయాలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులను ఒకేసారి బయటకు పంపుతున్న తరుణంలో తోపులాట జరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో విద్యార్థిని సీహెచ్‌ నాగలక్ష్మి చేయి విరిగింది. కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు హడలిపోయారు. పాఠశాలలో 430 మంది విద్యార్థులు ఉండగా.. వీరంతా ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పాఠశాల నుంచి ఒక్కటే మార్గం ఉండటంతో ఒక్కసారిగా అందరూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత సమయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బయటపడిన వి ద్యార్థులు అందరూ సమీపంలోని సబ్‌ రిజిస్ట్రార్‌రు కార్యాలయానికి చేరుకున్నారు. వంట మనిషికి మొ ఖం, శరీరంపై గాయాలయ్యాయి. ఆమెతో పాటు విద్యార్థిని నాగలక్ష్మిని తణుకు ప్రభుత్వాస్పత్రికి త రలించారు. పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊ పిరి పీల్చుకున్నారు. కాగా ప్రిన్సిపాల్‌ సుభాషిణి మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ మార్చే క్రమంలో మంటలు చెలరేగాయని చెప్పారు.

వంట మనిషి, విద్యార్థినికి గాయాలు

ఆస్పత్రిలో విద్యార్థిని నాగలక్ష్మి, వంట మనిషి మంగాదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement