సార్వాత్రా దిగాలు | - | Sakshi
Sakshi News home page

సార్వాత్రా దిగాలు

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

న్యూస్‌రీల్‌

శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి

రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కామవరపుకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని మట్టిని తోడేస్తోంది. 8లో u

శురకవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి, భీమవరం: మబ్బులు కమ్ముకుంటున్నా వర్షం జాడలేదు. వాననీటితో కాలువలు, చెరువులు నిండాల్సిన సమయంలో నేల తడవని పరిస్థితి. ఈనెలలో 175.3 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ సగం కూడా కురవలేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శివారు భూములకు సాగునీటి ఎద్దడి ఎదురవుతోంది.

కల‘వరి’పాటు

ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణం వెంటాడుతోంది. మరో వారం రోజుల్లో జూలై ముగియనుండగా ఇప్పటికి ముసురు కమ్ముకోకపోవడం కలవరపరుస్తోంది. గత ఏడాది జూలైలో సాధారణ వర్షపాతం నమోదవ్వగా ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈనెల్లో 175.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉంది. మరో వారం రోజుల్లో ఆగస్టు నెల మొదలుకానుండగా ఎల్‌నినో కారణంగా ఇప్పటి వరకు పడింది కేవలం 8.5 మి.మీ మాత్రమే. జిల్లాలోని 20 మండలాల్లోను 90 శాతానికి పైనే లోటుతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు వారాల వ్యవధిలో జిల్లాలో అత్యధికంగా నరసాపురం మండలంలో మూడు రోజులు, ఉండి, పాలకోడేరు, మొగల్తూరు మండలాల్లో రెండు రోజులు, పాలకొల్లు, వీరవాసరం, పోడూరు, ఆచంట, పెనుమంట్ర, ఆకివీడు, గణపవరంలలో మాత్రమే వర్షాలు కురవగా, ఎనిమిది మండలాల్లో ఒక్కరోజు కూడా వర్షం కురవలేదని గణాంకాలు చెబుతున్నాయి.

ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం

జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగు చేయనున్నారు. తొలకరి పనులకు ఊతమిస్తూ ఈ నెలలో విస్తారంగా వానలు కురవాల్సి ఉంది. నవంబరు చివర్లో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునేందుకు జూలై 15లోగా నాట్లు పూర్తిచేయాలి. వర్షాభావ పరిస్థితులతో పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు 50 శాతం విస్తీర్ణంలో మాత్రమే నాట్లు జరిగాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, ఇరగవరం తదితర మండలాల్లో నాట్లు దాదాపు పూర్తికావస్తుండగా కాలువల శివారు భూములైన పోడూరు, ఆచంట, యలమంచిలి, నరసాపురం, భీమవరం మండలాల్లో పనులు జాప్యమవుతున్నాయి. సాగునీటి ఎద్దడితో పలుచోట్ల ఇంకా పొలాల దుక్కులు చేయని పరిస్థితి ఉంది. సాగునీరందకపోవడం, ఎండల తీవ్రతకు నారుమడులు ఎండిపోతున్నాయని, పొలాలు నెరలు తీస్తున్నాయని శివారు ప్రాంతాలకు చెందిన రైతులు వాపోతున్నారు.

వర్షించని మేఘం

జూలైలో జాడలేని వానలు

ఈ నెలలో సాధారణ వర్షపాతం 175.3 మి.మీ.

కురిసింది కేవలం 8.5 మి.మీ. మాత్రమే

వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ నత్తనడక

జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు

ఇప్పటివరకు 50 శాతం విస్తీర్ణంలో మాత్రమే నాట్లు

కాలువలు వదిలి రెండు కావస్తున్నా ఇప్పటికీ శివారు ప్రాంతాలకు సాగునీరందని పరిస్థితి ఉందంటూ రైతు సంఘాల నేతలు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. పోడూరు మండలం గుమ్ములూరు రాయప్పనగర్‌ ఆయకట్టు. పెనుమదంలోని ఆయకట్టు, కవిటంలోని పట్టిగంపల కాలువ, వేడంగిలోని 6వ నం. కాలువపై గోలెపాడు, యలమంచిలి మండలంలోని చించినాడ చానల్‌పై మేడపాడు శివారు ఆయకట్టు. ఊటాడ, గొలెపరగట్టు. కాంబొట్లపాలెం ప్రాంతాల్లో సాగునీరు సరిగా అందక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెనుమంట్ర మండలంలోని నత్తరామేశ్వరం, మాముడూరు, జుత్తుగ, ఎస్‌.ఇల్లిందరపర్రు గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య ఎక్కువగా ఉందని స్థానిక రైతులు అంటున్నారు. ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో ఉంది. నీటి ఎద్దడి లేకుండా సాగునీటి సరఫరా సవ్యంగా జరిగేందుకు ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement