విద్యార్థులతో వెట్టిచాకిరీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో వెట్టిచాకిరీ

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

విద్యార్థులతో వెట్టిచాకిరీ

నూజివీడు: విద్యార్థులతో పాఠశాలలో పనులు చేయించడంపై యనమదల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని హైస్కూల్‌ ఆవరణలోని శాటిలైట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులు గురువారం సాయంత్ర సమయంలో పాఠశాల ముందు భాగంలో ఉన్న సిమెంట్‌ చేసిన ఫ్లోరింగ్‌ను, బాత్‌రూమ్‌లను విద్యార్థులతో కడిగించారు. విద్యార్థులు బాత్‌రూమ్‌ల వద్ద నుంచి బకెట్లతో నీళ్లను మోసుకొస్తూ, ఆవరణను శుభ్రం చేస్తుండటంపై స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలతో పనులు చేయిం చడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement