సర్‌వే సమాప్తం | - | Sakshi
Sakshi News home page

సర్‌వే సమాప్తం

Jul 25 2026 12:53 AM | Updated on Jul 25 2026 12:53 AM

ఆలయ అభివృద్ధికి విరాళం

న్యూస్‌రీల్‌

ముగిసిన సర్వే

నియోజకవర్గాల వారీగా ఇలా..

ఆలయ అభివృద్ధికి విరాళం
కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల అభివృద్ధికి ముదునూరి బంగార్రాజు దంపతులు (ఉండి) రూ.1,01,116 విరాళంగా అందించారు.

శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి, భీమవరం: ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ఓటర్ల మ్యాపింగ్‌ ప్రోగ్రాం ముగిసింది. జిల్లాలో 14,75,036 ఓట్లకు గాను 40 రోజుల పాటు సాగిన ఎన్యూమరేషన్‌లో మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రిపీటెడ్‌ తదితర 82,436 ఓట్లు తొలగించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబరు 3న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

జూన్‌ 15 నుంచి..

ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్‌ ప్రోగ్రాంను చేపట్టింది. 2002 ఓట్లు జాబితా ప్రకారం ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్‌కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఇంటింటికి వచ్చి ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలించాలి. తర్వాత కాలంలో ఓటుహక్కు పొందిన వారి వివరాలను ఈసీ మార్గదర్శకాలు మేరకు మ్యాపింగ్‌ చేయాలి. జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటా సర్వేకు గడువుగా నిర్ణయించి ఆ మేరకు సెప్టెంబరు 22న తుది జాబిత విడుదల చేయాలని తొలుత ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

1,471 పోలింగ్‌ కేంద్రాలు..

14.75 లక్షల మంది ఓటర్లు

జిల్లాలోని 1,471 పోలింగ్‌ కేంద్రాల్లో 14,75,036 మంది ఓటర్లు ఉన్నారు. 2002 జాబితా ప్రకారం వీరిలో 10,84,974 మంది ఓట్లు మ్యాపింగ్‌ కాగా, 3,90,062 ఓట్లు మ్యాపింగ్‌ కాలేదు. ఎన్యూమరేషన్‌ ఫారాలు ఓటర్లకు అందజేస్తున్నట్టు అధికారులు రికార్డుల్లో చూపించినా తిరిగి వాటిని సేకరించి డిజిటలైజేషన్‌ జాప్యమవుతూ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. జిల్లాలో కొన్నిచోట్ల బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లకుండా ఒక చోటకి పిలిచి ఫారాలు అందజేసినట్టు ఆరోపణలున్నాయి. డిజిటలైజేషన్‌ ఆలస్యమవుతుండటంతో మ్యాపింగ్‌ గడువు పెంచాలని వివిధ రాజకీయ పార్టీలతో పాటు అధికారుల నుంచి ఈసీకి అభ్యర్థనలు రావడంతో ఈనెల 24 వరకు పొడిగించింది.

జూన్‌ 15 నుంచి 40 రోజులపాటు సాగిన ఓటర్ల ఇంటింటా సర్వే, మ్యాపింగ్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వివిధ కారణాలతో 82,436 ఓట్లు తొలగించడంతో జిల్లాలోని ఓటర్ల సంఖ్య 13,92,600కు చేరింది. తొలగించిన వాటిలో మృతులు 43,434 మంది ఉండగా, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 20,288 మంది ఉన్నారు. ఆల్రెడీ ఎన్‌రోల్‌ (రెండు చోట్ల ఓటు ఉన్న వారు) అయి ఉన్న ఓట్లు 15,359, డిజిటలైజ్‌ నిమిత్తం ఎన్యూమరేషన్‌ ఫారాలు తిరిగి ఇవ్వకుండ ఆబ్సెంట్‌ అయిన ఓట్లు 3,286, ఇతర కారణాలతో తొలగించినవి 69 ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎన్‌రోల్‌ అయిన ఓట్లు నియోజకవర్గాల వారీగా పాలకొల్లులో 2,459 ఉండగా, నరసాపురంలో 1,341, తాడేపల్లిగూడెంలో 2,145, ఉండిలో 1,496, భీమవరంలో 3,247, తణుకులో 3,013, ఆచంటలో 1,658 ఓట్లు ఉన్నాయి. తొలిదశ ప్రక్రియ ముగియడంతో ఈనెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై అభ్యంతరాలు, క్లయిమ్‌లు అందజేసేందుకు వచ్చే నెల 30 వరకు గడువుంది. సెప్టెంబరు 28 నాటికి క్లయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబరు 3న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ఏఐ సృష్టించిన చిత్రం

నియోజకవర్గం మొత్తం ఓటర్లు మృతులు వలసలు ఇతరాలు డిజిటలైజ్‌ చేసినవి

పాలకొల్లు 1,95,062 6,391 2,134 2,736 1,83,801

నరసాపురం 1,71,053 4,440 1,021 1,460 1,64,132

తాడేపల్లిగూడెం 2,14,523 7,071 2,582 2,863 2,02,007

ఉండి 2,26,503 6,123 2,908 1,908 2,15,564

భీమవరం 2,52,549 6,231 3,055 3,553 2,39,710

తణుకు 2,35,359 7,656 6,195 4,286 2,17,222

ఆచంట 1,79,987 5,522 2,393 1,908 1,70,164

ముగిసిన ఇంటింటి సర్వే

జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లు

82,436 ఓట్ల తొలగింపు

వీరిలో మృతులు 43,434, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 20,288, ఆల్రెడీ ఎన్‌రోల్డ్‌ 15,359 మంది..

అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి సెప్టెంబరు 28 వరకు గడువు

అక్టోబరు 3న తుది ఓటర్ల జాబిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement