ఈవీఎం గోడౌన్ తనిఖీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి కార్యాలయ డిప్యూటీ సీఈఓ ఎస్.ఆంజనేయులుతో కలిసి కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు.
సాక్షి, భీమవరం/ఆకివీడు: వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నేత మంతెన యోగీంద్రకుమార్ (కోరుకొల్లు బా బు) నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన యోగీంద్రకుమార్ గతంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాలపురం, దెందులూరు నియోజకవర్గాల పరిశీలకుడిగా, నరసాపురం మున్సిపల్, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో క్రియాశీలకంగా సేవలందించారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యునిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భీమవరం: అమరావతి చాంపియన్‌షిప్ నియోజకవర్గ సెలెక్షన్ ట్రెయిల్స్‌ను శనివారం నుంచి జిల్లాలో ని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు జి ల్లా క్రీడాధికారి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అండర్–17, 23 బాల, బాలికల విభాగాల్లో 12 ఆ టల్లో సెలెక్షన్స్ ఉంటాయన్నారు. 25న.. వీరవాస రం ఎంఆర్‌కే జెడ్పీ హైస్కూల్‌లో, 27న ఆకివీడు బాయ్స్ హైస్కూల్‌లో, 28న తణుకు బాయ్స్ జెడ్పీ హైస్కూల్‌లో, 29న తాడేపల్లిగూడెం గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్‌లో, మార్టేరు జెడ్పీ హైస్కూల్‌లో, 31న పాలకొల్లు బీఆర్‌ఎంవీ హైస్కూల్, మొగల్తూరు జెడ్పీ హైస్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు.


