ఎరువుల కోసం ఆందోళన చెందొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల కోసం ఆందోళన చెందొద్దు

Jul 15 2026 1:04 AM | Updated on Jul 15 2026 1:04 AM

ఎరువుల కోసం ఆందోళన చెందొద్దు శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి సర్‌ గడువు పొడిగింపు

భీమవరం: సార్వా సీజన్‌లో వరి పండించే రైతులకు యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత సార్వా సీజన్‌లో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నట్లు చెప్పారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 17,392 టన్నుల యూరియా అవసరం కాగా ఇంతవరకు 3,322 టన్నులు అమ్మకాలు నిర్వహించగా 10,055 టన్నులు నిల్వ ఉన్నాయన్నారు. 1,530 టన్నుల డీఏపీ అవసరం ఇంతవరకు 978 టన్నులు అమ్మకం కాగా 2,722 టన్నులు నిల్వ ఉందన్నారు. సార్వా సీజన్‌కు 16,121 టన్నుల కాంప్లెక్స్‌ అవసరం కాగా ఇప్పటికే 2,792 టన్నుల అమ్మకాలు జరిగాయని 16,163 టన్నులు నిల్వలున్నాయని కలెక్టర్‌ వివరించారు. ఎరువుల డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగరాణి హెచ్చరించారు.

భీమవరం: బోధనలో బహుళ నైపుణ్యాలను వినియోగించి విద్యార్థులను ఆకట్టుకుని వారిలో అభ్యసనా ఫలితాలను సాధించాలని జిల్లా విద్యా శాఖాధికారి ఇ.నారాయణ అన్నారు. భీమవరం ఏఆర్‌కెఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్లో డీఆర్పీల రెండు రోజుల వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఆర్పీలు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకొని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు చక్కని శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌, భీమవరం డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి ఎన్‌.రమేష్‌, శిక్షణా కార్యక్రమం అనుసంధానకర్త జీవీవీ శ్రీనివాస్‌, సమగ్ర శిక్ష ఏఎస్‌ఓ ఎం. నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నాగరాణి

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను జులై 24 వరకు పొడిగించారని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో సర్‌ ప్రక్రియ నూరు శాతం పూర్తయినప్పటికీ, నో లింకేజీ ఆప్షన్‌లో ఉన్న ఓటర్ల సమాచారాన్ని కూడా సేకరించి డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో లక్ష మందికిపైగా ఓటర్లు నో లింకేజీ ఆప్షన్‌లో ఉన్నారన్నారు. వీరిని గుర్తించి డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు ‘సర్‌’ ప్రక్రియకు కొంత సమయం అధికారులు కేటాయించాలని సూచిం చారు. ఇంకా నమోదు చేసుకోని ఓటర్లు ఎవరైనా ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల తయారీలో రెవెన్యూ రికార్డులను పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పుస్తకాలు ముద్రించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement