అంతా గప్‌చుప్‌ | - | Sakshi
Sakshi News home page

అంతా గప్‌చుప్‌

Feb 11 2026 8:55 AM | Updated on Feb 11 2026 8:55 AM

అంతా

అంతా గప్‌చుప్‌

హరహర మహాదేవ

న్యూస్‌రీల్‌

రేంజ్‌ వీఆర్‌కు సీఐ, ఎస్సై

హరహర మహాదేవ
శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాల నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. 8లో u

బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం/తణుకు అర్బన్‌: తణుకు పోలీస్‌ సర్కిల్స్‌లో అసలు ఏం జరుగుతోంది? హఠాత్తుగా రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు మెడికల్‌ లీవ్‌పై వెళ్లిపోయిన ఘటన మరువకముందే మరో సీఐ, ఎస్సైను రేంజ్‌ వీఆర్‌కు పంపడం హాట్‌ టాఫిక్‌గా మారింది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో వైఫల్యాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండు సర్కిళ్ల పరిధిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు, స్థానికులు ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కూటమి వచ్చాక తణుకులో శాంతిభద్రతలు లోపించాయన్న ఆరోపణలున్నాయి.

ఏడాది క్రితం పైడిపర్రు ప్రధాన సెంటర్‌లోని లాడ్జిలో స్పెషల్‌ టీం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున జరుగుతున్న కోతాట గుట్టు రట్టయ్యింది. గత జనవరిలో రూరల్‌ స్టేషన్‌లో ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. తేతలిలో పశువధకు వ్యతిరేకంగా స్థానికుల చేస్తున్న ఉద్యమం, పెచ్చుమీరుతున్న హింసాత్మక ఘటనలు తరచూ తణుకు పేరును తెరపైకి తెస్తున్నాయి. అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కారుమూరి నివాసాన్ని అల్లరి మూకలు ముట్టడించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. తణుకు వై జంక్షన్‌లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద కూటమి నేతల ఫొటోలతో టీడీపీ సానుభూతిపరుడు ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదస్పదమైంది. దాదాపు నెలన్నర రోజులుగా ఇక్కడ పోలీస్‌ పికెటింగ్‌ కొనసాగుతోంది.

గత నెలలో ఉదరాళ్లపాలెంలో మాజీమంత్రి కారుమూరిని కించపర్చేలా అపరిచితులు పెట్టిన ఫ్లెక్సీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనకు దిగడంతో ఫ్లెక్సీలను తొలగించారు. అత్తిలిలో విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు వివాదస్పదం కావడంతో కొద్ది రోజులుగా ఇక్కడ కూడా పోలీస్‌ పికెటింగ్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గత నెల 25వ తేదీన రూరల్‌ సీఐ బి.కృష్ణకుమార్‌, ఎస్సై కె.చంద్రశేఖర్‌, 27న అత్తిలి ఎస్సై పి.ప్రేమ్‌రాజ్‌ లీవ్‌పై వెళ్లిపోయారు. రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. భీమవరం క్రైం విభాగంలో సీఐగా పనిచేసిన దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఈనెల 7న తణుకు రూరల్‌ సీఐగా విధుల్లో చేరారు. ఫ్లెక్సీలు, ఇతర వివాదాలకు స్థానిక పోలీస్‌ యంత్రాంగం వైఫల్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సెలవుపై పంపినట్టు తెలుస్తోంది.

తణుకు టౌన్‌ స్టేషన్‌లో ఏసీబీ దాడులు సంచలనమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఒక కేసు విషయమై తణుకు టౌన్‌ స్టేషన్‌ రైటర్‌ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహరంలో మరికొందరికి వాటాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఏసీబీ అధికారులు మీడియాకు తెలిపారు. ఏసీబీ దాడులు జరిగిన తరువాత కూడా కొన్ని కేసుల్లో లావాదేవీలు నిర్వహించినట్లుగా సమాచారం. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా సీఐ ఎన్‌.కొండయ్య, ఎస్సై ప్రసాద్‌ను ఉన్నతాధికారులు రేంజ్‌ వీఆర్‌కు పంపడం సర్కిళ్లలోని పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. తణుకు రూరల్‌ సీఐ వెంకటేశ్వరరావుకు టౌన్‌ ఇన్‌చార్జి సీఐగా బాధ్యతలు అప్పగించారు. కింది సిబ్బందిపై పర్యవేక్షణ లోపం, ఇతర ఆరోపణలతో వీరిని వీఆర్‌కు పంపినట్టు తెలుస్తోంది. తణుకు సర్కిళ్ల పరిధిలోని కొందరు సిబ్బంది పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి కొందరు పోలీసులు ఈ రెండు సర్కిళ్ల పరిధిలోని స్టేషన్లు మారుతూ ఇక్కడే తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.

తణుకు టౌన్‌, రూరల్‌ సర్కిళ్లలో వరుస ఘటనలు

గత నెలలో లీవ్‌పై వెళ్లిపోయిన రూరల్‌ సీఐ, రూరల్‌, అత్తిలి ఎస్సైలు

తాజాగా రేంజ్‌ వీఆర్‌కు టౌన్‌ సీఐ, ఎస్సై

అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో వైఫల్యాలే కారణమా?

అంతా గప్‌చుప్‌ 1
1/1

అంతా గప్‌చుప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement