నృసింహ మహా యజ్ఞానికి ఏర్పాట్లు
శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 8లో u
తణుకు అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందచేశారు. రూ.35 వేల కోట్ల బకాయిలు, మధ్యంతర భృతి, పే రివిజన్ కమిషన్‌పై సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలనే అంశాల్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాని కోరుతూ మంగళవారం తణుకులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్య నారాయణ ఆదేశాల మేరకు వినతిపత్రాలు అందచేశామని, వారు సానుకూలంగా స్పందించినట్లు సంఘ సభ్యులు వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు ఉమర్ అలీషా, జిల్లా ఉపాధ్యక్షుడు రామనాగు, భీమవరం ఉపాధ్యక్షులు, ఆదిత్య జిల్లా మహిళా విభాగం అసోసియేట్ ప్రెసిడెంట్ నిర్మల, తాడేపల్లిగూడెం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ బాబు, కోశాధికారి రామకృష్ణ, తణుకు తాలూకా అధ్యక్షులు అరవింద్, ఆర్గనైసింగ్ సెక్రటరీ ధర్మతేజ, ట్రెజరర్ మధు తదితరులు పాల్గొన్నారు.


