టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్లు, బరియల్ గ్రౌండ్స్, పార్కులు, రోడ్లు, డ్రైన్లు, తదితర ఇంజినీరింగ్ పనులపై సమీక్షించారు. టిడ్కో ఈఈ టి.వి.నారాయణరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ విజయ్, మున్సిపాలిటీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ–ఆఫీస్ ద్వారా పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్‌న్స్ హాలు నుంచి మంగళవారం ఈ–ఆఫీస్ నిర్వహణపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


