కోడి పందేల్లో ఎమ్మెల్యే చింతమనేని
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతికి ముందస్తుగానే కోడి పందేల నిర్వహణకు అనుమతులు ఇచ్చేసినట్టు పందేలరాయుళ్లు బహిరంగంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో గురువారం టీడీపీ నేతలు కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. ఈ పందేల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని వీక్షించారు. కోడి పందేలను చూసేందుకు యువకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు కూత వేటు దూరంలో ఇలా బహిరంగంగా కోడి పందేలు నిర్వహిస్తున్నా అధికారులు మిన్నకుండిపోయారు.


