కొత్త సొబగులతో కనువిందు
కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు..
పక్షుల రాకతో కొల్లేరుకు కళ
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త సొబగులను సంతరించుకుంది. మోంథా తుపాను ధాటికి కోతకు గురైన పక్షుల విహార చెరువుకు అటవీశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవలో భాగంగా రూ.20 లక్షలతో పక్షులు నివసించడానికి 50 కృత్రిమ ఇనుప స్టాండ్లు, విద్యుత్ సోలార్‌ను సమకూర్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు పర్యాటకులను ఆకర్షించడానికి అటవీశాఖ అధికారులు కేంద్రంలో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
కొల్లేరులో పక్షుల వీక్షణకు అనువైనది శీతాకాలం. ఏడాదిలో నవంబరు నుంచి మార్చి వరకు స్వదేశీ, విదేశీ పక్షులు సందడి కొల్లేరులో కనిపిస్తుంది. అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షుల వేలాదిగా ఆటపాక కేంద్రానికి రావడంతో దీనికి ‘పెలికాన్ ఫ్యారడైజ్’ నామకరణం చేశారు. ఇక్కడ పక్షుల విహారానికి 285 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పక్షుల సంతానోత్పత్తి, అవాసాల కోసం 176 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆటపాక పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. ప్రస్తుతం ఆటపాకలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్రేహెరాన్, గ్లోబిహైబీస్ పక్షులు సందడి చేస్తున్నాయి.
ఆటపాకలో అభివృద్ధి పనులు..
ఇటీవల మోంథా తుపాను దాటికి ఆటపాక పక్షుల విహార కేంద్రం అతలాకుతలమైంది. చెరువు గట్లు కోతకు గురయ్యాయి. దీంతో కొన్ని వారాల పాటు పక్షుల కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం అటవీశాఖ రూ.9 లక్షల నిధులతో పక్షుల కేంద్రం టికెట్ కౌంటర్ నుంచి ఈఈసీ కేంద్రం వరకు 600 మీటర్ల రోడ్డును ఏర్పాటు చేసింది. కోతకు గురైన గట్లకు మరమ్మతులు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రూ.20 లక్షలతో పక్షుల ఆవాసాలకు 50 ఇనుప కృత్రిమ స్టాండ్లు, ఈఈసీ కేంద్రం విద్యుత్ అవసరరాలకు సోలార్ యంత్రాన్ని అందించారు. ఇటీవల రూ.15 లక్షలతో నూతన బోటును తీసుకొచ్చారు. ఇప్పుడు పక్షుల వీక్షణకు పర్యాటకులకు మూడు బోట్లు అందుబాటులో ఉన్నాయి.
కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పక్షుల వీక్షణకు ఇదే అనువైన కాలమవడంతో త్వరలో తేదీలను ప్రకటించనున్నారు. జిల్లా టూరిజం శాఖకు కొల్లేరు ఉత్సవ ఏర్పాట్లను అప్పగించారు. ఆటపాక, ఏలూరు మండలంలో పక్షుల విహార ప్రాంతాలను ఎంపిక చేసి కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పక్షుల వీక్షణ, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్, తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వీటిలో పాటు దేవాలయాలు, పర్యాటక కేంద్రాల వివరాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వాటి వివరాలు తెలిపేలా సూచికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పక్షుల రాకతో కొల్లేరు సరస్సు కళకళలాడుతోంది. పర్యాటలకు కోసం అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. త్వరలో నిర్వహించనున్న కొల్లేరు ఉత్సవం మరింత శోభ తేనుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రానికి మరమ్మతులు చేశాం. నూతన బోటు పర్యాటలకు అందుబాటు ఉంచాం. నూతన ఏడాది, సంక్రాంతి పండగలకు ఏక్కువ సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారని భావిస్తున్నాం.
– కే.రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు.
పక్షుల విహార కేంద్రానికి పర్యాటకుల సందడి
ఐసీఐసీఐ బ్యాంకు రూ.20 లక్షల సాయంతో కృత్రిమ స్టాండ్లు, సోలార్
కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు
కొత్త సొబగులతో కనువిందు


