మెప్మా.. న్యాయం చెప్పమ్మా | - | Sakshi
Sakshi News home page

మెప్మా.. న్యాయం చెప్పమ్మా

Jan 2 2026 12:23 PM | Updated on Jan 2 2026 12:23 PM

మెప్మ

మెప్మా.. న్యాయం చెప్పమ్మా

చర్యలు చేపట్టాలి

ఆకివీడు: యానమిటేర్లు డ్వాక్రా మహిళలను ముంచేశారు. వారి పేరిట రుణాలు రూ.2.80 కోట్లు తీసుకుని పరారయ్యారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు నోటీసులు రావడంతో విషయం బయటపడింది. ఇది జరిగి 20 రోజులు గడుస్తున్నా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో తీసుకుని రుణాలు తాము ఎక్కడ చెల్లంచగలమని బాధితులు లబోదిబోమంటున్నారు.

డ్వాక్రా మహిళల నిరసన

ఆకివీడు యూనియన్‌ బ్యాంకు అధికారులు సుమారుగా 32 గ్రూపులకు చెందిన 320 మంది మహిళళలు అప్పులు చెల్లించాలని తాకీదులు పంపారు. ఇంత సొమ్ము తామెక్కడ తీసుకున్నామని మహిళలంతా రోడ్కెక్కి నిరసన తెలిపారు. దీంతో యానిమేటర్ల ఖాతాలు తనిఖీ చేశారు. యానిమేటర్‌ సుధాకు సంబంధించిన డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.1.90 కోట్లు, మేర, స్థానిక సమతానగర్‌కు చెందిన యానిమేటర్‌ హేమలత డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.90 లక్షల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. నిరక్షర్యాస్యులైన డ్వాక్రా మహిళలు తీర్మానాలు, సంతకాలు, వేలిముద్రలు, స్టాంపులు వంటివాటితో పాటు విత్‌డ్రా ఫారాలు కూడా యానిమేటర్ల వద్దే ఉంచడంతో అవినీతి, అక్రమాలకు తావిచ్చినట్లయింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు యానిమేటర్లు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే డ్వాక్రా గ్రూపుల నుంచి లక్షల రూపాయలు డ్రా చేసిన వైనంపై నేటికీ మెప్మా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సంబంధిత బ్యాంకు నుంచి మాత్రమే పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. యానిమేటర్లపై తక్షణం చర్యలు తీసుకుని దుర్వినియోగమైన సొమ్మును జమ చేయించాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

అసలే వడ్డీల భారం

డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీలపై వడ్డీల భారం పడుతుంది. ప్రతినెలా వాయిదాలు సకాలంలో చెల్లించకుంటే బ్యాంకులు వడ్డీపై వడ్డీలు వేస్తాయి. తీసుకున్న అప్పును కొంత (లక్షలు) చెల్లించిన వెంటనే మళ్లీ రూ.5 లక్షల మేర రుణం అందజేయడంతో మహిళలు అత్యాశతో రుణం తీసుకుని తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రూ. 5 లక్షల్లో మూడు లక్షలకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుంది, మిగిలిన రూ. 2 లక్షలకు సాధారణ వడ్డీ చెల్లించాల్సిందే. గ్రూపులో కొందరు సకాలంలో వాయిదా కట్టకపోయినా సున్నా వడ్డీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సున్నా వడ్డీ సొమ్ము వెనక్కి రావడంలేదని మహిళలు వాపోతున్నారు. కొద్దిమంది ఖాతాల్లో మాత్రమే సొమ్ము జమ అవుతుందని చెబుతున్నారు.

డ్వాక్రా మహిళలను ముంచేసిన యానిమేటర్లు

రూ.2.80 కోట్లు డ్రా చేసి పరారీ

రుణాలు చెల్లించాలని డ్వాక్రా మహిళలకు నోటీసులు

లబోదిబోమంటున్న బాధితులు

20 రోజులు గడుస్తున్నా.. నోరు మెదపని మెప్మా అధికారులు

డ్వాక్రా అప్పు చూసి భయం వేస్తోంది. మాకు తెలియకుండా మా గ్రూపుల నుంచి లక్షలాది రూపాయాలు డ్రా చేసిన యానిమేటర్లపై నేటికీ ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. యానిమేటర్లను పట్టుకుని వారి నుంచి సొమ్ము జమ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

– పిల్లా రంగమ్మ, సంతపేట, బాధితురాలు, ఆకివీడు

మెప్మా.. న్యాయం చెప్పమ్మా 1
1/1

మెప్మా.. న్యాయం చెప్పమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement