మోటార్‌సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్: ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు గురువారం తెల్లవారుజామున్న ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన తాడేపల్లి మహిమారావు (21) బైక్‌పై మెట్ట ఉప్పరగూడెం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా, కుంచనపల్లి శ్మశాన వాటిక సమీపంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొన్నాడు. అనంతరం పక్కనే ఉన్న రాయిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. దీంతో మహిమారావు తలకు బలమైన గాయం కావడంతో తొలుత ఏలూరు, అక్కడ నుంచి విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్‌సైకిల్‌పై ఉన్న కోమటి నాగబాబుకు గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుడు నాగబాబు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఇద్దరికి గాయాలు
జంగారెడ్డిగూడెం: కేఆర్‌పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన అమరారాం చౌదరి (24) జంగారెడ్డిగూడెంలోని ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. గురువారం వేగవరం సమీపంలో ఒక వ్యక్తి నడుచుకుని వెళుతుండగా, మరో వ్యక్తి సైకిల్‌పై వెళుతున్నాడు. వీరిద్దరిని తప్పించే క్రమంలో కేఆర్‌పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం ఎదురుగా వస్తున్న అమరారాం చౌదరి మోటార్‌సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అమరారాం చౌదరి అక్కడికక్కడే మృతిచెందాడు. చౌదరి వ్యాపారం నిమిత్తం అశ్వారావుపేట వెళ్లి తిరిగి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు, సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి బేతాళ వెంకటపతి గాయపడినట్లు ఎస్సై తెలిపారు.
మోటార్‌సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి


