ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు ఇలా..
● స్వామివారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు, ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, తదితరులు కొబ్బరికాయలు కొట్టి, జెండా ఊపి గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభిస్తారు.
● ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి కొండపైన ఆశ్రమం వద్దకు చేరుతుంది. అక్కడి నుంచి ఉగాది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంటుంది.
● 5 కిలోమీటర్లు మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మార్గ మధ్యలో మంచినీరు, పండ్లు, అల్పాహారాలు, టీలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
● అలాగే ఆంబులెన్స్, నడవలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సును ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండే ఈ నిజరూప దర్శనం మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది.
ఉచిత దర్శనం భక్తులు, అలాగే రూ.100, రూ.200 టికెట్లు ద్వారా వెళ్లేవారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న క్యూలైన్ల ద్వారా తాత్కాలిక క్యూ కాంప్లెక్స్‌లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు.
ఆన్‌లైన్‌లో రూ.100, రూ.200 టికెట్లు తీసుకున్న వారు షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్తారు.
రూ.500 టికెట్లు తీసుకున్నవారు, అలాగే గోవింద స్వాములు, గ్రామస్తులు కొత్త అనివేటి మండపం నుంచి కొత్త క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి దక్షిణ రాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. గ్రామస్తులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు తూర్పురాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు.
నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్న భక్తులు పడమర రాజగోపురం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్ ద్వారా, ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్తారు.
దర్శనానంతరం భక్తులంతా ఆలయంలోంచి తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్తారు. అక్కడ ఉచిత ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
పడమర రాజగోపురం నుంచి ఆలయ అర్చకులు, పండితులకు మాత్రమే ప్రవేశం.
దర్శనం టికెట్‌లను క్యూలైన్‌లలోనే విక్రయిస్తారు.
ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు ఇలా..


