క్రిస్మస్ శుభాకాంక్షలు
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): క్రిస్మస్‌ను పురస్కరించుకుని కలెక్టర్ చదలవాడ నాగరాణి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఆదర్శమన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి క్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎస్‌హెచ్‌జీ మహిళలచే నెలకొల్పిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఊతమిచ్చేలా యువ విద్యార్థుల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం విష్ణు కాలేజీ ఎంబీఏ, సాఫ్ట్‌వేర్ విద్యార్థులతో సమావేశమై జిల్లాలో ఎస్‌హెచ్‌జీ మహిళలు నెలకొల్పిన చాక్లెట్ ఫ్యాక్టరీల అభివృద్ధికి మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సులు తయారీ, తదితర విషయాలపై వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులు రూపొందించాల్సిందిగా సూచించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, భీమవరం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ వర్మ, ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు


