అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
పెనుమంట్ర: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన అమర జవాన్ రాజశేఖర్ భౌతికకాయం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశ రక్షణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో బోట్ బోల్తా పడిన ఘటనలో రాజశేఖర్ అమరుడయ్యారు. ఖండవల్లి, పెనుగొండ, మార్టేరు గ్రామాల మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. యాత్రలో తోటి జవాన్లు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. దేశ భక్తి నినాదాలు చేశారు. అధికార లాంచనాలతో రాజశేఖర్ దుస్తులు, జాతీయ జెండాను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. ఆర్మీ అధికారులు మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగిన జవాన్‌ను కోల్పోయామన్నారు.
స్వగ్రామం ఆలమూరు చేరిన భౌతిక కాయం
అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు


