నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
తాడేపల్లిగూడెం అర్బన్ : పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సబ్‌డివిజన్ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల నివారణ, ప్రజల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని ఎస్పీ నయీం ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, మైనర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలు, బాలికలపై అకృత్యాలపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని నిందితులకు త్వరితగతిన శిక్ష విధించేలా పక్కా ఆధారాలతో దర్యాప్తు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మాదక ద్రవ్యాల భారిన పడకుండా నిరంతరం నిఽఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ తదితరులు పాల్గొన్నారు.


