సత్యసాయి జయంతి వేడుకలు
భీమవరం (ప్రకాశంచౌక్): భగవాన్ సత్య సాయిబాబా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి ధర్మాలను ఆచరించి భగవత్ స్వరూపుడిగా పూజింపబడుతున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం బాబా శత జయంతి వేడుకల సందర్భంగా స్థానిక భీమేశ్వరస్వామి దేవస్థానం సమీపంలోని సత్యసాయి బాబా మందిరంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించారు. బాబా చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేశారు. అనంతరం సాయిబాబా సేవా సంస్థ సభ్యులతో కలిసి సత్యసాయి బాబా శత వార్షిక లోగో, 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు.
భీమవరం: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలోని అసెంబ్లీలో విద్యార్థులతో నిర్వహించే మాక్ అసెంబ్లీ నిర్వహణకు జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్టు డీఈఓ ఈ.నారాయణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూల్ విద్యార్థిని వై.జోయిసి (భీమవరం), పెనుగొండ మండలం దేవ హైస్కూల్ విద్యార్థి కోడెల్లి సరిత (ఆచంట), యలమంచిలి మండలం మేడపాడు హైస్కూల్ విద్యార్థి ఎ.శ్రీవర్షిణి (పాలకొల్లు), మొగల్తూరు మండలం పిప్పళ్లవారితోట హైస్కూల్ విద్యార్థి పి.గుణశివరామ్‌కుమార్ (నరసాపురం), పాలకోడేరు మండలం పెన్నాడ హైస్కూల్ విద్యార్థి జి సత్య (ఉండి), ఇరగవరం మండలం రేలంగి హైస్కూల్ విద్యార్థి ఎం.శ్రీమహాలక్ష్మి (తణుకు), పెంటపాడు మండలం దర్శిపర్రు హైస్కూల్ విద్యార్థి పి.గాయత్రిదుర్గ (తాడేపల్లిగూడెం) ఎంపికయ్యారన్నారు. విద్యార్థులుతో గైడ్ టీ చర్లు కేవీ రామచంద్రరావు, సూర్యకళ అమరావతి వెళతారని పేర్కొన్నారు.
వీరవాసరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 17 బాలికల క్రికెట్ జట్ల ఎంపికలు దేవరపల్లి ఏఎస్‌ఎన్‌ఆర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 25న నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా కార్యదర్శులు పత్రికా ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్ 9866678844లో సంప్రదించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న స్పెషల్ జ్యుడీషియల్ మే జిస్ట్రేట్ అఫ్ సెకండ్ క్లాస్ పోస్టులు తాత్కాలిక పద్ధతిపై భర్తీకి ప్యానెల్‌లో పేర్లు చేర్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 4 ఖాళీగా ఉన్నా యని దరఖాస్తులను జిల్లా జడ్జి, పశ్చిమగోదా వరి జిల్లా, ఏలూరు కార్యాలయానికి డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటలలోపు పంపాలన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.45 వేలు గౌరవ వేతనంగా ఇస్తారన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని అల్లూరి సీ తారామరాజు స్టేడియంలో ఈనెల 25న ఉ దయం 9 గంటల నుంచి విభిన్న ప్రతిభావంతులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, 600 మందికిపైగా పోటీల్లో పాల్గొంటారన్నారు.


