కౌలుకోలేని దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కౌలుకోలేని దెబ్బ

Nov 23 2025 6:21 AM | Updated on Nov 23 2025 6:23 AM

నేడు సత్యసాయి ఉత్సవాలు

రసవత్తరంగా పోటీలు

న్యూస్‌రీల్‌

కౌలు రైతులకు మోసం

ఆర్థికంగా నలిగిపోతున్నారు

ఇస్తామని చెప్పి ఇవ్వలేదు

నేడు సత్యసాయి ఉత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో అధికారికంగా ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ నాగరాణి తెలిపారు.

ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఎన్నికల హామీని చంద్రబాబు సర్కారు తుంగలోకి తొక్కింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా కౌలు రైతులు ఉండగా రెండో విడతలోనూ మొండిచేయి చూపింది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. మోంథా తుపాను కలిగించిన కష్టం నుంచి కొంత ఊరట లభిస్తుందన్న వారి ఆశలపై నీళ్లుచల్లింది. సాగులో కష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్ట డం, వచ్చిన దానిలో అసలు రైతుకు మగతా పోనూ వారికి మిగిలేది అంతంతమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు నష్టం కలిగిస్తే అప్పు ల ఊబిలో కూరుకుపోయేదీ కౌలు రైతులే. అసలు రైతులతో పాటు కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు పదేపదే ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్‌లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌ లేకుండా చేయడం గమనార్హం.

రెండో విడతలోనూ దగా

ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ తొలి విడత సాయా న్ని ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడత నుంచి కౌలు రైతులకు సాయం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అప్పట్లో కూటమి నేతలు ప్రకటించారు. ప్రస్తుత సీజన్‌కు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4.03 లక్షల ఎకరాల్లో తొలకరి పంటగా వరి సాగుచేశారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో దాదాపు 45 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 70 శాతానికిపైగా కౌలు రైతులే ఉంటారని అంచనా. అన్నదాత సుఖీభవ రెండో విడతలో తమకు ప్రభుత్వం సాయం విడుదల చేస్తుందని గంపెడాసతో రైతులు ఎదురుచూస్తున్నారు. తొలి విడతతో కలిపి రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఒక్కో కౌలు రైతుకు రూ.10,000 చొప్పున సాయం విడుదల కావాల్సి ఉంది. కాగా రెండో విడతలోనూ చంద్రబాబు సర్కారు కౌలురైతులకు ఎగనామం పెట్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది.

గతంలో లక్ష్యానికి మించి..

కౌలు రైతులకు గత జగన్‌ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతుభరోసా, పంటల బీమా పరిహారం తదితర అన్ని రకాల ప్రయోజనాలను అందించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సంబంధించి ఒకసారి జారీచేసిన కార్డును మరలా యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్‌ చేసుకునే వీలు కల్పించింది. భూ యజమానుల్లో అపోహలు తొలగడంతో జిల్లాలో సీసీఆర్‌సీ కార్డుదారుల జారీ గణనీయంగా పెరిగింది. 2023–24 సీజన్‌లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి గాను 89,589 కార్డులు జారీచేశారు. జగన్‌ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే చంద్రబాబు పాలనలో కార్డుల సంఖ్య 72,259కు తగ్గిపోవడం గమనార్హం.

నూజివీడులో ఎస్‌జీఎఫ్‌ బాలుర, బాలికల అండర్‌–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. 13 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. 8లో u

బాబు మార్కు మోసం

కౌలు రైతులను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం

అన్నదాత సుఖీభవ 2వ విడతలోనూ మొండిచేయి

దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వని వైనం

కౌలు రైతులకు అండగా నిలిచిన గత జగన్‌ సర్కారు

అసలు రైతుల మాదిరి అన్ని ప్రయోజనాలూ వర్తింపు

తామరాడకు చెందిన సుమారు పది మంది కౌలు రైతులకు రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం వేసే రైతు భరోసా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను చంద్రబాబు సక్రమంగా అమలు చేయకుండా కౌలు రైతులను మోసం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు మిగిలేది చేసిన అప్పులే. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలి.

– ఎస్‌.వెంకటేశ్వరరావు

రైతు సంఘం నాయకుడు, పెనుగొండ

ఏడాదిన్నరగా కౌలు రైతులకు ప్ర భుత్వం ఎలాంటి సాయం ఇవ్వలేదు. రైతు భరోసాతో పాటు పంటల బీమా దక్కకపోవడంతో కౌలు రైతులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. పెట్టుబడుల కోసం అందించే అరకొర సాయం కూడా అందడం లేదు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

– సాక కిసింజర్‌, కౌలు రైతు, రామయ్యగూడెం, చినకాపవరం, ఆకివీడు మండలం

సొంత భూమి అరెకరం ఉంది. నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. గత ప్రభుత్వం రైతు భ రోసా పేరుతో క్రమం తప్పకుండా రూ.13 వేలు మా ఖాతాలో జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పేరుతో రూ.7 వేలు ఇస్తామన్నారు. మొదటి, రెండో విడతల సొమ్ములు కౌలు రైతులకు ఇప్పటికీ జమకాలేదు.

– గునుపూడి మురళి, కౌలు రైతు,

బ్రాహ్మణచెరువు ,పెనుమంట్ర మండలం

లక్ష్యానికి దూరంగా గుర్తిపు కార్డుల జారీ

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. చంద్రబాబు పాలనలో కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ తూతూమంత్రంగా సాగుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కౌలు రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే పశ్చిమగోదావరి జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. కాగా కేవలం 72,259 మందికి మాత్రమే జారీచేశారు. ఏలూరు జిల్లాలో 75,000 కార్డుల జారీ లక్ష్యానికి గాను 60,973 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు.

కౌలుకోలేని దెబ్బ 1
1/4

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 2
2/4

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 3
3/4

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ 4
4/4

కౌలుకోలేని దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement