స్థలం లేదు.. ఇల్లూ లేదు
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పేరుతో గృహ నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఏలూరు జిల్లాలో లక్షకు పైగా ఇళ్ల స్థలాలు, 98,874 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 2023 అక్టోబర్‌లో 25 వేలకు పైగా ఇళ్లకు గృహ ప్రవేశాలు సైతం జరిగాయి. ఏలూరు డివిజన్‌లో 458 లేఅవుట్లలో 60,042, నూజివీడు డివిజన్‌లో 137 లేఅవుట్లలో 14,628, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 144 లేఅవుట్లలో 13,420, జిల్లావ్యాప్తంగా 27,582 సొంత స్థలాల్లో 27,582 ఇళ్ల నిర్మాణానికి, 98,874 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. వీటికి సబ్సిడీలు, బ్యాంకు రుణం అన్నీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆయా కాలనీలకు విద్యుత్ సౌకర్యం, నిబంధనలకు అనుగుణంగా రహదారులు, మంచినీరు తదితర వసతులు కల్పించారు.
ఏలూరు(మెట్రో) : క్రెడిట్ కొట్టేయడంలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటిరారు. తాను చేసింది శూ న్యమైనా.. కంటికి కనిపించిందంతా చేశానని చెప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తులు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ జగనన్న కాలనీ ఇళ్లపై గో బెల్స్ ప్రచారానికి తెరదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చే సేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష లాది స్థలాలు, ఇళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణానికి కృషి చేశారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చేసరికి 80 శాతం వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభంగా కాగా, కొన్ని పూర్తయి గృహ ప్రవే శాలు కూడా జరిగాయి. మరికొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అప్పట్లోనే ఇళ్లకు రిజిస్ట్రేషన్ సైతం పూర్తిచేసి లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. స్థానికంగా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లకు హక్కులు కల్పించారు.
ఒక్క ఇల్లు మంజూరు చేయకపోయినా..
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా జిల్లాలో ఒక్క ఇంటి స్థలం గానీ, ఇల్లు గానీ మంజూరు చేయలేదు. కనీసం భూసేకర ణ గానీ, సెంటు స్థలం కొనుగోలు గానీ చేయలేదు. అయినా వేల సంఖ్యలో ఇళ్లు నిర్మించాం. రూ.కోట్ల లో ప్రజలకు లబ్ధి చేకూర్చాం అంటూ ప్రచారం చే స్తున్నారు. దీనికి మరో అడుగు వేసి గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లను కూడా తామే కట్టించ్చామంటూ ప్రచార ఆర్భాటాలు మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత జిల్లాలో 15,024 గృహ ప్రవేశాలు జరిగాయని పేర్కొంటున్నారు. దీనికి కొనసాగింపుగా ప్రతిఒక్కరి సొంతింటి కల చంద్రబాబు సర్కారు నెరవేర్చుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై విమర్శలు
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చే నాటికే జిల్లావ్యాప్తంగా 45,453 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యా యి. 35,432 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటిలో 15,024 ఇళ్లు పూర్తయ్యాయని, వాటికి గృహ ప్రవేశాలు చేపడుతున్నట్టు టీడీపీ ప్రజాప్రతినిధులు ఊదరగొడుతూ హడావుడి చేశారు. జిల్లాలోని ఆ యా నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు అంటూ 10 లోపు ఇళ్లను ప్రారంభించి, బయటకు మాత్రం వేల సంఖ్యల్లో నిర్మాణాలు పూర్తయ్యాయని ప్రకటిస్తున్నారు. ఇక ఇప్పటికే పూర్తయి లబ్ధిదారులు ని వాసం ఉంటున్న ఇళ్లను సైతం గృహ ప్రవేశాల జాబితాలో చేర్చడం మరింత విడ్డూరం. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రోత్సా హం కరువై చాలాచోట్ల లబ్ధిదారులు గృహనిర్మాణాలను నిలిపివేస్తున్నారు.
కొర్రీలతో కాలయాపన
చంద్రబాబు ప్రభుత్వం స్థలం గానీ, ఇల్లు గానీ మంజూరు చేయకున్నా.. కొత్త ఇళ్ల కోసం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఆయా సచివాయాల్లోకి వెళితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళితే కొర్రీలతో కాలయాపన చేస్తున్నారు.
గృహాలపై నీలి నీడలు
పైసా విదల్చని చంద్రబాబు సర్కారు
గృహ నిర్మాణాలపై క్రెడిట్ చోరీ
గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఇళ్లనూ ప్రభుత్వ ఖాతాలోకి..


