కారు మబ్బులు.. రైతుల బెంబేలు
వరి మాసూళ్లు చేపడుతున్న తరుణంలో ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమబ్బులు రైతులను కలవరపెడుతున్నాయి. వరి కోతల సమయంలో మారుతున్న వాతావరణం బెంబేలెత్తిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రక్షించుకునేందుకు అన్నదాత పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులు మిగిలినపంటనైనా కాపాడుకునేందుకు మాసూళ్లు ముమ్మరం చేశారు. యంత్రాలతో కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ సమయంలో మబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. ధాన్యాన్ని బస్తాల్లో నింపి, నెట్టులు కట్టి బరకాలతో కప్పి ఉంచారు.
– పెంటపాడు
అలంపురంలో మబ్బులు కమ్మిన ఆకాశం
ధాన్యం ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు
ధాన్యంపై బరకాలు కప్పి..
కారు మబ్బులు.. రైతుల బెంబేలు
కారు మబ్బులు.. రైతుల బెంబేలు


