రుణాల మంజూరుపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం–జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం (బ్యాంకర్ల సమావేశం) కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధ్యక్షతను నిర్వహించారు. సీసీఆర్‌సీ కార్డుల మంజూరు, పశు కిసాన్, ఎస్‌హెచ్‌జీ, ఎంసీపీ, పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, వీవర్స్ ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ, సూర్యఘర్, విద్యా రుణాలు తదితర అంశాల ప్రగ తిపై కలెక్టర్ బ్యాంకర్లతో సమీక్షించారు. భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. 2024–25 మెప్మా అవని వార్షిక సంచికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎల్‌డీఎం ఎ.నాగేంద్ర ప్రసాద్, యూబీఐ రీజనల్ హెడ్ వి. సత్యనారాయణ, నాబార్డ్ డీడీ నిష్యంత్ చంద్ర, ఆర్‌బీ ప్రతినిధి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
7,432 ఎపిక్ కార్డుల పంపిణీ
జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను అందించా మని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో పలు అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,461 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 123 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.


