బాలికపై ఘాతుకం.. స్పందించిన అధికారులు
వరి కోతల్లో బిజీ
ఆచంట నియోజకవర్గంలో సార్వా కోతలు ఊపందుకొంటున్నాయి. ఇప్పటికే సగం పూర్తి కావాల్సి ఉన్నా, తుపాను ప్రభావంతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 12లో u
పెంటపాడు: సాక్షిలో ప్రచురితమైన ‘బాలికపై సంరక్షురాలి ఘాతుకం’ వార్తకు జిల్లా అధికారులు మంగళవారం స్పందించారు. ఈ సందర్భంగా గణపవరం ప్రాజెక్టు సీడీపీవో టీఎల్ సరస్వతి, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ ఆధ్వర్యంలో బాలిక గోండి సుభాషిణిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాలిక నాయనమ్మ నుంచి వివరాలు సేకరించారు. బాలికకు సంరక్షురాలు వాతలు పెట్టిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనలో మాధవి, సత్యనారాయణపై జువైనల్ యాక్టు ప్రకారం పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. అనంతరం గూడెం ఏరియా ఆసుపత్రిలో బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్‌వైజర్లు మాట్లాడుతూ బాలికను అట్లకాడతో వాతలు పెట్టినట్లు గుర్తించామన్నారు. గాయాలు తగ్గినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. బాలికను సీడబ్ల్యూసికి తరలించేందుకు వీలుగా ఉన్నతాఽధికారులకు సిఫార్సు చేశామన్నారు.
బాలికపై ఘాతుకం.. స్పందించిన అధికారులు


