వీధిలైట్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేస్తాం
ద్వారకాతిరుమల: దూబచర్ల నుంచి రాళ్లకుంట మీదుగా ద్వారకాతిరుమల క్షేత్రానికి భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో వీధిలైట్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని రాళ్లకుంట గ్రామానికి చెందిన దాత గంటా బాబ్జి తెలిపారు. సాక్షి దినపత్రికలో సోమవారం ‘నడక దారిలో నరకయాతన’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. దాతల సహకారంతో దూబచర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు ప్రతి 50 మీటర్లకు ఒక వీధి లైటును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పంచాయతీల్లో తీర్మానాలు చేసి, అంచనాలు రూపొందించి విద్యుత్ సంస్థకు రూ.22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. ఈ మొత్తం దాతల నుంచి సేకరించామన్నారు. ఇప్పటికే దూబచర్ల నుంచి రాళ్లకుంట శివారు వరకు సుమారు 118 వీధి లైట్లు ఏర్పాటు చేశామని, ఇంకా రాళ్లకుంట నుంచి ద్వారకాతిరుమల వరకు 100 లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.


