గిరిజన గ్రామాల్లో పోలీసుల తనిఖీలు
కుక్కునూరు: అల్లూరి జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో విలీన మండలాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు మండలంలో నివసిస్తున్నారన్న అనుమానంతో నెమలిపేట, లంకాలపల్లి గుత్తికోయ గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. గ్రామంలోకి కొత్తవారెవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. అంతేకాక కుటుంబసభ్యులు కాకుండా ఇతర వ్యక్తులను ఇంట్లోకి అనుమతించవద్దని ఆదేశించారు.


